- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇది నిజంగా సమ్‌థింగ్ స్పెషల్’.. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్న "DUCIMUS - WE LEAD" ముగింపు కార్యక్రమంలో మాజీమంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి. లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు సమ్‌థింగ్ స్పెషల్. ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు. మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభ భాయి పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేడ్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే. ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ న్యాయవాదులు ఉంటారు. ఎక్కడ న్యాయవాదులు ఉంటారో ఆ పోరాటం గమ్యాన్ని చేరుతుంది. విజయం సిద్ధిస్తుంది.
హేట్ స్పీచ్ బిల్లు..
మార్టిన్ లూథర్ కింగ్ అన్న “Injustice anywhere is a threat to justice everywhere” అనే మాట గుర్తుపెట్టుకోండి. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికీ ఈ దేశంలో పేదవాడికి న్యాయం అందడం లేదు. న్యాయం దక్కని పీడితుల పక్షాన గొంతై నిలబడండి. ప్రభుత్వాలు పోరాటాలను అణిచివేయాలని చూస్తాయి. అలంటి సమయంలో మీరు సమాజానికి అండగా నిలబడాలి. అసెంబ్లీకి హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారు. అది ఫ్రీజ్ స్పీచ్ బిల్లు. మాట్లాడే స్వేచ్ఛను హరించడానికే రేవంత్ రెడ్డి ఆ బిల్లును తీసుకొచ్చాడు. ప్రశ్నిస్తే కేసు, వేలు ఎత్తి ప్రభుత్వ తప్పిదాన్ని చూపిస్తే కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తే శాసన సభ్యులంతా వ్యతిరేకిస్తే అది సెలెక్ట్ కమిటీకి పోయింది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు అవి legislature, ఎగ్జిక్యూటివ్, Judiciary, ప్రెస్/మీడియా. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది Judiciary. ఫ్రీడమ్ అఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డా.బీఆర్ అంబేడ్కర్ ఈ దేశ ప్రజలకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత యువ లాయర్లుగా మీ మీద ఉన్నది.
మీ బాధ్యత...
ఠాకూర్ ఆడిటోరియంకు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. వేణుగోపాల్ రెడ్డి అనే తెలంగాణ బిడ్డ స్వరాష్ట్రం కోసం ఇక్కడే ప్రాణత్యాగం చేసాడు. అసెంబ్లీ ముట్టడికి వస్తుంటే NCC గేట్ దగ్గర యాదయ్య అనే యువకుడు చేసిన ప్రాణత్యాగం ఇంకా నా కండ్ల ముందు కనిపిస్తుంది. ఎన్నో పోరాటాల ఫలితం, ఎంతో మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పేషెంట్లకు ప్రాణం పోయడం డాక్టర్ల బాధ్యత.. బాధితులకు అండగా నిలవడం లాయర్లుగా మీ బాధ్యత. న్యాయం గెలవాలి, ధర్మం నిలబడాలి. బాధితుల పక్షాన వారి గొంతై నిలబడాలనేదే నా ఆకాంక్ష. ఒకప్పుడు అసెంబ్లీలో లాయర్లు ఎక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఎక్కువ అవుతున్నారు లాయర్లు తక్కువ అవుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి. దేశానికి ఒక కొత్త మార్గదర్శకం కావాలి. అంబేడ్కర్‌కి డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర ఉస్మానియాది. కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా పనిచేసిన శివ రాజ్ సింగ్ చౌహాన్ ఈ లా కాలేజీ స్టూడెంట్. మీరు కూడా రాజకీయంగా ఎదగాలి’ అని హరీష్ రావు పేర్కొన్నారు.






