- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడుతా.. రైతులకు హరీష్ రావు కీలక హామీ
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మైదానంలో కొనసాగుతున్న రైతుబడి అగ్రిషోను బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు అగ్రి షో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని చెప్పారు. అగ్రి షో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు ఎంతో మేలు అని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు పనిముట్లను రాయితీపై ఇవ్వాలని రైతుల పక్షాన అసెంబ్లీ చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఈ నెల 20న ప్రారంభమైన ఈ వ్యవసాయ ప్రదర్శన 22వ తేదీ వరకూ కొనసాగనుంది. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేశాయి. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వచ్చాయి. మూడు రోజుల్లో పలు అంశాలపై సదస్సులు సైతం జరుగనున్నాయి. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని, అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావచ్చని తెలిపారు.






