- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమల బిడ్డ కాదు.. వెర్రిబిడ్డ: CM రేవంత్‌పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ మండిపడ్డారు. సీఎంకు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. ప్రాజెక్టుల మీద లేదని ఎద్దేవా చేశారు. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టి పరువు తీసుకున్నారని అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బనకచర్ల(Banakacharla Project) ఏ బేసిన్‌లో ఉంది అని అడగటం ఏంటని ప్రశ్నించారు. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్‌ల గురించి తెలుసుకోవడమని అన్నారు. ‘మాట్లాడితే నల్లమల నుంచి వచ్చాను. తొక్కుకుంటూ వచ్చాను. తోసుకుంటూ వచ్చాను అంటాడు. అసలు నల్లమల ఏ ప్రాంతంలో ఉందో ముందు తెలుసుకోవాలి. రేవంత్ నల్లమల(Nallamala) బిడ్డ కాదు.. వెకిలి మాటలు మాట్లాడే వెర్రిబిడ్డ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల విషయంలో ప్రభుత్వం మొద్దునిద్ర పోతుంటే.. తామే తట్టి లేపామని గుర్తుచేశారు. తాను రెండుసార్లు ప్రెస్‌మీట్ పెట్టి బనకచర్ల గురించి మాట్లాడిన తర్వాత.. అప్పుడు ముఖ్యమంత్రికి సోయి వచ్చిందని విమర్శించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయకూడదు. అందరం కలిసి బనకచర్లకు అడ్డుకుందాం అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. ‘గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అంటాడు. అది మీ అయ్యా జాగీరా. లేకపోతే నువ్వేమైనా రాజువా. నువ్వు ఎలా చెబుతావు. ఇది డెమొక్రటిక్ ప్రభుత్వం. స్టేట్ ఆఫ్ తెలంగాణ. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్. మీ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే పరిస్థితులు వచ్చాయి. ఏదైనా విషయం మీద మాట్లాడే ముందు.. క్లియర్‌గా తెలుసుకో’ అని సీఎం రేవంత్‌కు హరీష్ రావు సూచించారు. ‘రేవంత్ రెడ్డిలో ఇంకా అడుక్కునే బుద్ధి పోలేదు.. అందుకే చంద్రబాబు(Chandrababu)ను అడుక్కుంటున్నాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి. ఈరోజు చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఈ ఆదిత్యనాథ్’ అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.






