- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీశ్ రావు తండ్రి మృతి.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం బంద్ చేసిన బీఆర్ఎస్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం చివరి శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం చివరి శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రావు (Harish Rao) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకొని.. సత్యనారాయణ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికి మాజీ సీఎం కేసీఆర్ (KCR), సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే హరీశ్ రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం (BRS Jubilee Hills election campaign) బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి మృతి నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు.






