Chamala: హరీశ్ రావు ట్వీట్ కు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |

బీఆర్‌ఎస్ హయాంలో ప్రచారం ఫుల్లు.. ప్రజలకు ఒరిగింది నిల్లు అని కాంగ్రెస్ ఎంపీ చామల ధ్వజమెత్తారు.

Chamala: హరీశ్ రావు ట్వీట్ కు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 22 నెలల కాంగ్రెస్ (Congress) పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు హరీశ్ రావు ఎక్స్ లో చేసిన పోస్టుకు స్పందించిన చామల ఎక్స్ వేదికగా.. 'మీ అధికారం పోయేనాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు ఫుల్లు.. మీరు పెట్టిన మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు నిల్లు.. మీరు పోయేనాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఫుల్లు.. యూనివర్సిటీలు, విద్యాలయాల్లో ఫాకల్టీ నిల్లు.. రెండు దఫాల్లో తెచ్చిన అప్పులు ఫుల్లు.. చేసిన అభివృద్ధి నిల్లు.. కాళేశ్వరం పేరిట దోపిడి ఫుల్లు.. రైతులకు కోసం మీరు చేసింది నిల్లు.. మొత్తంగా బీఆర్‌ఎస్ (BRS) హయాంలో ప్రచారం ఫుల్లు.. ప్రజలకు ఒరిగింది నిల్లు' అంటూ కౌంటర్ ఇచ్చారు.

అంతకు ముందు హరీశ్ రావు ఎక్స్ లో పోస్టు చేస్తూ 'బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బందు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బందు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి బందు, జాబ్ క్యాలెండర్ బందు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బందు, నిధుల లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బందు.. డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బందు, రైతులకు రుణ మాఫీ బందు, పంట బోనస్ బందు, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బందు.. పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బందు, 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బందు, అభివృద్ది బందు.. ఎక్కడ చూసినా బందు, బందు, బందు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేతగాని, దద్దమ్మ పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారి పోయారని ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్దమయ్యారు. మీ డ్రామాలను బందు పెట్టే రోజులు ఇక దగ్గర్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు.

Next Story