Harish Rao: స్థాయికి తగ్గట్లు మాట్లాడు.. పీసీసీ చీఫ్ కు హరీశ్ రావు కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-05-31 05:02:12  IST  )

ఈటల, హరీశ్ రావు ఫాం హౌస్ లో మాట్లాడుకున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై హరీశ్ రావు స్పందించారు.

Harish Rao: స్థాయికి తగ్గట్లు మాట్లాడు.. పీసీసీ చీఫ్ కు హరీశ్ రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC chief Mahesh Kumar Goud) దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేశ్ కుమార్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. కాళేశ్వరంపై విచారణకు రమ్మని నోటీసులుు రాగానే శామీర్ పేటలోని ఓ ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) సీక్రేట్ గా సమావేశం అయ్యారని ఈ మంతనాలెందుకు అని నిన్న మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై శనివారం హరీశ్ రావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. విలువలకు తిలోదకాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారని పీసీసీ చీఫ్ ను దుయ్యబట్టారు.

స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి:

బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు, నిజం అయిపోవని పెళ్లిలోనో, చావులోనో కలిసిన సందర్భాలో తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీని వీడిన నాయకులను గాని ఎన్నడూ వ్యక్తిగతంగా కలిసింది లేదన్నారు. నేనెప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడనన్నారు. ఇకనైనా ఇలాంటి ఆరోపణలు మానుకుని స్థాయికి తగ్గట్లు వ్యవహరిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దృష్టిపెట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ కు సూచించారు.

Next Story