- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గురు భక్తికి ఇదే నిదర్శనం’.. CM రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్
బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ను మొద్దు నిద్ర లేపిందే బీఆర్ఎస్ పార్టీ. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకూ అలుపెరుగని పోరాటం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీనే. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్‌కు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. మళ్లీ అవే పాత అబద్ధాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అసలు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయట్లేదు. ఇది చంద్రబాబు పట్ల నువ్వు చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం. GWDT అవార్డు ప్రకారం, CWC అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదు. ఏపీ అనుమతుల కోసం CWC కి వెళ్లే కంటే ముందే అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లాలనే సోయి కూడా లేదు నీకు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం’ అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా?.. నువ్వు మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది రేవంత్ రెడ్డి. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే, లెక్కకు మించి అబద్దాలు ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్‌పై చేస్తున్న నీ క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. నీ తెలంగాణ వ్యతిరేక విధానాలను అసహ్యించుకుంటున్నది’ అని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.






