- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌కు పగ్గాలిస్తే తప్పకుండా స్వాగతిస్తా.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS) పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేటీఆర్(KTR)కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాను అని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్(KCR) తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తాను, ఆయన ఆదేశాలను పాటిస్తానని అన్నారు. రాముడికి హనుమంతుడిలాగా.. కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను.. కేసీఆర్ మాటే.. హరీష్ బాట.. ఎట్టి పరిస్థితుల్లో గీత దాటేది లేదని అని వెల్లడించారు.
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలంతా.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.






