- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: మహేశ్ కుమార్ గౌడ్ నోరు అదుపులో పెట్టుకో.. హరీశ్ రావు వార్నింగ్
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోటీపడుతున్నారని అబద్దాల్లో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నంబర్ వన్ అయితే మహేశ్ కుమార్ గౌడ్ నంబర్ 2 అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. బనకచర్ల గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడి నైతిక హక్కు లేదన్నారు. ఏ టీవీలో కూర్చుందామో చెప్పు.. ఎక్కడ మాట్లాడుతామో చెప్పు.. నేను సిద్ధం.. నువ్వు చర్చకు వస్తావా అని మహేశ్ కుమార్ గౌడ్ కు సవాల్ విసిరారు. అసెంబ్లీ పెట్ట చేతగాక పారిపోతున్నారని, బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుందని భయంతో వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి మా బీఆర్ఎస్ కార్యకర్త చాలని అన్నారు. ఇవాళ సిద్దిపేటలో సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మాటలు ఎక్కువ చేతలు తక్కువ:
రేవంత్ రెడ్డి 18 నెలల పాలన చూశాక కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైందని అందుకే మళ్ళీ కేసీఆర్ రావాలి, కావాలి అంటున్నారన్నారు. మళ్లీ పదేండ్ల దాకా కాంగ్రెస్ పార్టీ విత్తనం కూడా పుట్టకుంట రేవంత్ రెడ్డి చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు. కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు, గ్రామపంచాయతీలో టాక్టర్లకు ఇంధనానికి కూడా డబ్బులు లేక బంద్ పెట్టారని మండిపడ్డారు. పోయిన వానకాలం, యాసంగి రైతుబంధు ఎగ్గొట్టారన్నారు. రూ.15,000 రైతుబంధు ఇస్తానని రూ.12,000 ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు కోరాలన్నారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్. దేశానికి రైతుబంధును పరిచయం చేసింది కేసీఆర్. అన్నారు. కాంగ్రెస్ ఓట్లకు ఓట్లకు రైతుబంధు ఇస్తే, నాట్లకు నాట్లకు మధ్యలో రైతుబంధు వేసింది కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్టు లేదు, సూది లేదు, మందు లేదని మీ చిల్లర ఉపన్యాసాలు ప్రజలు నమ్మరన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు ఓడిపోతామని భయంతోనే కదా మహేష్ కుమార్ గౌడ్ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పూర్తి అయిదు సంవత్సరాలు అధికారంలో ఉండాలి. 20 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ రాదని కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు. మళ్లీ సర్పంచ్, మండల, జిల్లా పరిషత్తులు గెలవాలి. అందరం కలసి ఐక్యతతో ముందుకు పోదామన్నారు.






