- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొరడాతో బుద్ధి చెప్పండి: హరీష్ రావు
by Gantepaka Srikanth |
అబద్ధపు హామీలు.. వికారపు మాటలు.. వికృత చేష్టలు.. బండ బూతులు.. ఇవి తప్పా రేవంత్ తన రెండున్నరేండ్ల పాలనలో సాధించింది గుండు సున్నా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: అబద్ధపు హామీలు.. వికారపు మాటలు.. వికృత చేష్టలు.. బండ బూతులు.. ఇవి తప్పా రేవంత్ తన రెండున్నరేండ్ల పాలనలో సాధించింది గుండు సున్నా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వికాసం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడితే కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తే.. రేవంతు తుగ్లక్ పాలనతో అధోగతి పాలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని.. ఓటు అనే కొరడాతో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఓటర్లపై ఉన్నదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Next Story






