- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సీఎంకు హరీశ్ రావు సంచలన సవాల్
ఎస్ఎల్‌బీసీ (SLBC) సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఎల్‌బీసీ (SLBC) సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని సీఎం రేవంత్ నిరూపించాలని అన్నారు. ఒక వేళ ఆయన చెప్పిందే నిజమని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ (SLBC) విషయంలో రేవంత్‌కు చిత్తశుద్ధి లేదని, ప్రమాదం జరిగి 10 రోజులు గడస్తున్నా.. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని అన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను త్వరలో జరగబోయే అసెంబ్లీ (Assembly)లో ఎండగడతామని తెలిపారు. మోకాలికి, బోడి గుండుకు ముడేసి మోసగించడం రేవంత్‌కు అలవాటేనని.. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. తన సన్నిహిత మిత్రుడి కూతురు పెళ్లికి అబుదాబి (Abu Dhabi) వెళ్లిన మాట వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని సీఎంపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోనే ఉంది. ఆదివారం వనపర్తి (Wanaparthy) సభలో ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బీసీ (SLBC) సకాలంలో పూర్తి చేయపోవడం వల్లే ప్రమాదం జరిగిందని సీఎం వ్యాఖ్యనించారు. 8 మంది ప్రాణాలు పోయానని ఆ పాపం కేసీఆర్ (KCR)దేనని విమర్శించారు. నిరుద్యోగులకు అవకాశం కల్పించకుండా కేసీఆర్ తనతో పాటు కొడుకు, కూతురు, అల్లుడు బంధువులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని కామెంట్ చేశారు. కృష్ణా నది (Krishna River)లో తెలంగాణ (Telangana) నీటి వాటా తేల్చకుండా ఆంధ్రాకు తరలించేలా సంతకాలు చేసింది కేసీఆర్ (KCR) అని, ఆ పాపం వల్లే పాలమూరు ప్రాజెక్టులు పడావు పడ్డాయని ఫైర్ అయ్యారు. ఎస్ఎల్‌బీసీ (SLBC) ప్రమాదం జరిగినప్పుడు హరీశ్ రావు దుబాయ్ (Dubai)లో దావత్ చేసుకోలేదా అని అన్నారు. ఆయన పాస్‌పోర్టు (Passport) ఒకసారి బయటపెట్టాలని.. లేకపోతే తాను ఆ వివరాలు బయటపెతానంటూ సీఎం రేవంత్ రెడ్డి హరీశ్‌కు చుకలంటించారు.






