- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR : కేసీఆర్ నివాసానికి వెళ్ళిన హరీష్ రావు
బీఆర్ఎస్ అధినేత(BRS Cheif), మాజీ సీఎం కేసీఆర్(KCR) ను ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(MLA Harish Rao) మరోసారి నేడు ఆయన ఫాంహౌస్ ఎర్రవల్లిలో కలిశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత(BRS Cheif), మాజీ సీఎం కేసీఆర్(KCR) ను ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(MLA Harish Rao) మరోసారి నేడు ఆయన ఫాంహౌస్ ఎర్రవల్లిలో కలిశారు. వీరి ఇరువురికి కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) నుంచి నోటీసుల అందిన తర్వాత ఇది రెండవ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి మధ్య ఆరాగంటకు పైగా చర్చ నడవగా.. ఈ భేటీలలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యూహాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే, ఈ సమావేశాలపై కేసీఆర్ నుంచి గాని హరీష్ రావు నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleswram Project)పై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి(Medigadda Barrage) కుంగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోస్ కమిషన్(Justice Chandra Ghose Commission) ను నియమించిన సంగతి తెలిసిందే. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG) ఇచ్చిన నివేదికలో బయటపడిన ఆర్థిక అవకతవకలు, అధిక ఖర్చు, లోపభూయిష్ట ప్లానింగ్ పై ముఖాముఖి వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో వీరు ఇరువురూ సమావేశం అవడం తీవ్ర చర్చనీయాంశం అయింది.






