- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలోని ఆ స్కూళ్లో క్షుద్ర పూజలు
కేసీఆర్ పాలనలో ఐఐటీలు, ఎంబీబీఎస్ ర్యాంకులతో నాడు దేశానికే ఆదర్శంగా నిలిచిన మన తెలంగాణ గురుకులాలు.. నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం కడుపు నిండా అన్నం దొరకని దీనస్థితికి దిగజారాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ పాలనలో ఐఐటీలు, ఎంబీబీఎస్ ర్యాంకులతో నాడు దేశానికే ఆదర్శంగా నిలిచిన మన తెలంగాణ గురుకులాలు.. నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం కడుపు నిండా అన్నం దొరకని దీనస్థితికి దిగజారాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్ పెట్టారు. ‘జనగామ జిల్లా, పాలకుర్తి మండలం గూడూరు బాలికల గురుకులంలో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరు.. సమయానికి పెట్టడానికి అన్నం కూడా లేదు. వీటన్నిటికీ మించి, బడిలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని ఆ పసిబిడ్డలు భయంతో వణికిపోతూ.. రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంతలా భ్రష్టుపట్టిందో అర్థమవుతోంది. చదువుకోవాల్సిన ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే ఏ ఒక్క అధికారీ పట్టించుకోరా? తక్షణమే గూడూరు గురుకుల పాఠశాలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థినులకు భద్రతతో పాటు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్ రావు పేర్కొన్నారు.






