- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రేవంత్ హామీలు గాలిమాటలే.. గురుకులాలపై హరీశ్‌రావు సూటి ప్రశ్న
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించు రేవంత్ రెడ్డి అని హితువు పలికారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా నేనే ఇకనుండి (Gurukula) గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయని విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయని ఆరోపించారు. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024 కి పెంచిన ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారిందని ఆరోపించారు. గురుకులాలంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు రేవంత్ రెడ్డి.. అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గాడిదప్పిన గురుకుల విద్యా వ్యవస్థపై శ్రద్ధ వహించాలన్నారు. తక్షణమే గురుకులాల సమస్యలను పరిష్కరించి, 2500 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలను చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.






