ఎన్ని కేసులు పెట్టినా సింహంలా గర్జిస్తాం.. హరీష్ రావు ట్వీట్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-22 13:27:51  IST  )

మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడంపై ఇప్పటికే మెదక్ వేదికగా స్పందించిన హరీష్ రావు మరోసారి ఎక్స్ వేదికగా స్పందించారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ము లేకనే రేవంత్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

ఎన్ని కేసులు పెట్టినా సింహంలా గర్జిస్తాం.. హరీష్ రావు ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడంపై ఇప్పటికే మెదక్ వేదికగా స్పందించిన హరీష్ రావు మరోసారి ఎక్స్ వేదికగా స్పందించారు. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ము లేకనే రేవంత్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇచ్చారన్నారు. రేవంత్ బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగంగానే నిన్న తనకు, నేడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం అని దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమేనని పేర్కొన్నారు.

మీరు బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని, మేం ధైర్యవంతులం కాబట్టే ప్రజల మధ్య నిటారుగా నిలబడి నిన్ను నిలదీస్తున్నామని పేర్కొన్నారు. మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్ రెడ్డి సిద్దంగా ఉండాలన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బీఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా మిమ్మల్ని, మీ పార్టీని వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. మీ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారని తెలిపారు.

Read More... నోటీసులు అందాయి.. కేటీఆర్ విచారణకు వస్తారు: అడ్వొకేట్

ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేం కాదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Next Story