Harish Rao: కాసేపట్లో కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ.. బీఆర్ఎస్ లో ఉత్కంఠ

by Prasad Jukanti |   (  Updated:2025-09-06 07:16:28  IST  )

యూకే నుంచి తిరిగి వచ్చిన హరీశ్ రావు కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు.

Harish Rao: కాసేపట్లో కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ.. బీఆర్ఎస్ లో ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) మాజీ మంత్రి హరీశ్ రావుపై (Harish Rao) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన హరీశ్ రావు మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో (KCR) భేటీ కాబోతున్నారు. లండన్ నుంచి ఇవాళ ఉదయమే తిరిగి వచ్చిన హరీశ్ రావు ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. హరీశ్ రావు, సంతోష్ రావు లు కాంగ్రెస్, బీజేపీతో టచ్ లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్డీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర చేస్తున్నారని కవిత చేసిన ఆరోపణలపై హరీశ్ రావు కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది. అయితే కవిత ఆరోపణల నేపథ్యంలో పార్టీ హరీశ్ రావుకు బాసటగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో హరీశ్ రావుకు కేసీఆర్ సపోర్టు ఉందనే చర్చ జరుగుతోంది.

Next Story