Harish Rao: కేటీఆర్ విచారణ వేళ ఢిల్లీకి హరీశ్ రావు!

by Prasad Jukanti |

కేటీఆర్ విచారణ వేళ హరీశ్ రావు ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారింది.

Harish Rao:  కేటీఆర్ విచారణ వేళ ఢిల్లీకి హరీశ్ రావు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో (Formula E car race case) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా రేస్ వ్యవహారంలో జరిగిన ఒప్పందాలు, నగదు బదిలీ వ్యవహారాలపై కేటీఆర్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వైపు హైదరాబాద్ లో కేటీఆర్ ను ఈడీ (ED) విచారిస్తుండగా మరో వైపు హరీశ్ రావు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. హరీశ్ రావు ఢిల్లీ టూర్ తో ఏం జరగబోతున్నదనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ కు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. దీంతో ఇవాళ ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్టు అవుతారా అనే చర్చ జోరుగా జరుగుతున్నది. ఇటువంటి తరుణంలో హరీశ్ రావు హస్తినా టూర్ వెనుక మతలబు ఏంటనేది ఆసక్తి రేపుతున్నది.


Next Story