- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Harish Rao: ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తమ ‘X’ ఖాతాలో ట్వీట్ చేశారు. పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్ ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఐటీఐ కాలేజీలను చూసినా పరిస్థితి ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్స్ లేక, సిబ్బంది కొరతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర పరికరాలు పనిచేయని స్థతికి చేరాయని వెల్లడించారు. ఈ సమస్యతో విద్యార్థులు ప్రాక్టికల్స్ కూడా చేయలేకపోతున్నారని తెలిపారు.
కొన్నిచోట్ల ఐటీఐ తరగతుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు కూర్చునే పరిస్థితి లేదన్నారు. ఇక గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని అన్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థతకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ విద్యార్థి పాము కాటుతో, మరో విద్యార్థి డెంగీ జ్వరంతో ప్రాణాలు పొగొట్టుకోవడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిందని అన్నారు. గురుకుల ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా తయారయ్యాయని తెలిపారు. స్నానాల గదులకు డోర్లు లేక, సరిపడా బాత్‌రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఎక్కడా కూడా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. ఒకవేళ పెట్టినా.. భోజనం నాణ్యంగా ఉండకపోవడంతో కారం మెతుకులతో విద్యార్థులు కడుపులు నింపుకుంటున్నారని అన్నారు.
ఇలా ఇన్ని సమస్యల నడుమ విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారని ఆయన ప్రశ్నించారు. గురుకులాల్లో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తల్లిదండ్రులు ఎలా నమ్ముతారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిగజారుతుండటం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన సకల సౌకర్యాలు వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు అన్నారు.