- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ప్రతిపక్షాలను అణిచివేయడం అప్రజాస్వామికం.. హరీశ్ రావు సంచలన ట్వీట్
పోలీసుల బలాన్ని ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతిపక్షాలను అణిచివేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల బలాన్ని ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతిపక్షాలను అణిచివేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ (Congress) నాయకుల దాడులను నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలో ఇవాళ బీఆర్ఎస్ (BRS) పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఆ ధర్నాను భగ్నం చేసేందుకు ఉదయం నుంచి పోలీసులు (బీఆర్ఎస్) ముఖ్య నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు.
అయితే, అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ.. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ‘X’ (ట్విట్టర్)లో వేదికగా స్పందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్ (Hyderabad)లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడం, గృహ నిర్భంధం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీసు బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేసిన బీఆర్ఎస్ (BRS) నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.






