- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సాపూర్, రెడ్డిపల్లి సబ్ స్టేషన్‌ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి
మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్, రెడ్డిపల్లి సబ్ స్టేషన్‌ను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాగ్ బుక్కులను పరిశీలించి 24 గంటల కరెంటు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్, రెడ్డిపల్లి సబ్ స్టేషన్‌ను అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాగ్ బుక్కులను పరిశీలించి 24 గంటల కరెంటు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. రేవంత్ రెడ్డి 24 గంటలు అని చెప్తే మీరు 12 గంటలు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్స్ పరిశీలిస్తే రైతులకు 12గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని తెలిసిందన్నారు.
మీద నుండి కరెంట్ రాకపోతే వీళ్ళు మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. పై నుండి కరెంట్ రాకపోతే ఏఈ అయినా ఇతర అధికారులు అయినా ఏం చేస్తారని అన్నారు. వాళ్లపై చర్యలు తీసుకుంటే ఏం వస్తుందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేక మూలకు పడేశారని విమర్శించారు. కరెంట్ సరఫరా అవ్వడం లేదని, ట్రాక్టర్లలో డీజిల్ నింపడానికి డబ్బులు లేవని అంటే అధికారులను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. చిన్న చిన్న అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిజాయితీగా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. :






