- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Grama Sabalu: అప్లయ్.. అప్లయ్ బట్ నో రిప్లయ్.. గ్రామసభల తీరుపై హరీశ్ రావు ఆగ్రహం
గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట (Grama Sabalu) గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసిందన్నారు. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితాను విడుదల చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆరోపించారు. దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఈనెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చెప్పడం హాస్యాస్పదమన్నారు. అలాంటప్పుడు నాలుగు రోజుల పరిమితి పెట్టి గ్రామ సభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది? అని నిలదీశారు. 400 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలను విజయవంతంగా మోసం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చారిత్రక గణతంత్ర్య దినోత్సవం అయిన జనవరి 26న మరో మోసానికి సిద్ధమైందని జోస్యం చెప్పారు.
దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ప్రశ్నించారు. మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నరు, ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు, కుల గణనలో వివరాలు తీసుకున్నరు, ఇప్పుడు గ్రామ సభల పేరిట మరో కొత్త డ్రామా చేస్తున్నరు, మల్లా దరఖాస్తులు తీసుకుంటున్నరు.. అని విమర్శించారు. ‘అప్లయ్, అప్లయ్ బట్ నో రిప్లయ్’ అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే కాంగ్రెస్ దృష్టి ఉందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ది ఉంటే, గ్రామ సభల పేరిట ఎందుకు ఇంత డ్రామా? అని ప్రశ్నించారు. ఐటీలో మేటిగా ఉన్న తెలంగాణలో ప్రజలు పనులు వదులుకొని, రోజుల పాటు గ్రామ సభల్లో నిరీక్షించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్శించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలనుకుంటే టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదన్నారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముందని నిలదీశారు.






