- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైలెంటుగా టార్గెట్ తగ్గించిన ఉత్తమ్ : హరీశ్ రావు విమర్శలు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తగ్గించడంపై హరీష్ రావు విమర్శలు చేశారు.

- కొద్దిరోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేస్తారేమో
- అబద్ధాలు చెబుతూ రైతులకు మోసం
- మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు మంత్రి ఉత్తమ్ సైలెంట్‌గా తగ్గించారని ఆరోపించారు. మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవైపు కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూనే.. మరోవైపు 75 లక్షల మెట్రిక్ టన్నులకే కొనుగోలుకు పరిమితం అంటారా అని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెబుతూనే టార్గెట్‌ను తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పే ముందు 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమై.. రైతుల గోసను కప్పి పుచ్చేందుకు చేస్తున్న అబద్ధాల ప్రచారం దుర్మార్గమని పేర్కొన్నారు. ఒకవైపు రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తుంటే.. మరోవైపు కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా? కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా? తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోయింది అబద్ధమా? నెలల తరబడి కొనుగోళ్లు ఆలస్యం చేసింది అబద్ధమా? డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతులను అప్పుల పాలుచేసింది అబద్ధమా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చొని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదని.. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడాలని సూచించారు.






