- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: త్యాగ చరిత్ర మాది.. ద్రోహ చరిత్ర కాంగ్రెస్ ది: హరీశ్ రావు
తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరుకున్నారని అందుకే ఇవాళ శాసనసభలో సీఎం స్పీచ్ ను బహిష్కరించామన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీశ్ రావు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారు. 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేనందునే 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారన్నారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ దే అని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని నిలదీశారు. పోతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు.
త్యాగ చరిత్ర మాది.. ద్రోహ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది:
నాడు పొతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ (Congress) నాయకులు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదు. మేము 40 రోజులు అసెంబ్లీని స్థంభింపచేశామన్నారు. తెలంగాణ కోసం మేము ఆ రోజు 6 మంత్రి పదవులు వదులుకుంటే ఉత్తమ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చి కృష్ణ నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారన్నారు. ద్రోహ చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది అయితే త్యాగ చరిత్ర బీఆర్ఎస్ దన్నారు. కేసీఆర్ (KCR) సెక్షన్ 3ని సాధించి దాని ద్వారా 573 టీఎంసీల నీళ్లు తెచ్చారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది బీఆర్ఎసే అన్నారు. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణం అన్నారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మంకి నీళ్లు ఇవ్వగలిగాం. గతంలో హుజూర్ నగర్ ని ముంపుకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారు. మేము పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నామన్నారు.






