ఆ రంగాన్ని CM రేవంత్ చేజేతులా నాశనం చేస్తున్నాడు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-31 10:24:05  IST  )

కాంగ్రెస్ పాలన(Congress Government)లో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లతో పాటు ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆరోపించారు.

ఆ రంగాన్ని CM రేవంత్ చేజేతులా నాశనం చేస్తున్నాడు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పాలన(Congress Government)లో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లతో పాటు ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆరోపించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో కలిసి ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్‌లో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని మండిపడ్డారు.

శాంతి భద్రత దిగజారడం, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసీ, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(Infrastructure Development) చేయకపోవడం, భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం, కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగం(Real estate sector)పై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం(Hyderabad real estate sector) అంటే బీఆర్ఎస్ హయాంలో బిల్డర్లకు స్వర్గధామంలా ఉండేదని.. ఇప్పుడు బిల్డర్లకు నరకకూపం అయ్యిందని అన్నారు. ‘‘నేను రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి వచ్చాను. రియల్‌ ఎస్టేట్‌ గురించి నాకు చెప్తారా?’’ అని మీడియా సమావేశంలో దబాయించిన సీఎం రేవంత్‌ రెడ్డి( CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులా నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేశారు. హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్(Hyderabad Growth Engine) అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ, తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందని తెలిపారు.


Read More..

నేను కొడితే మాములుగా ఉండదు.. కాంగ్రెస్‌కు KCR సంచలన వార్నింగ్

Next Story