- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొంగులేటిపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ నాయకులు ఆయనపై కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ నాయకులు ఆయనపై కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పొంగులేటిపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను మేం పక్కన పెడితే మీరు పార్టీలోకి చేర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. గతంలో పొంగులేటిని ఆర్థిక ఉగ్రవాది అని భట్టి విక్రమార్క అనడాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పొంగులేటి ఎలా ముద్దు అయ్యాడని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ 9 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఒకటే సీటు అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌తో ఖమ్మం జిల్లా నష్టపోయిందని.. ఏడు మండలాలను ఏపీలో కలిపారన్నారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలని విమర్శించారు. ఈసారి గెలుపుతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Also Read..
Next Story






