- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పరిహాసం చేసింది: హరీశ్ రావు
ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయంపై హరీశ్ రావు స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పరిహాసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఢిల్లీలో ఒక మాట.. తెలంగాణలో మరోమాట మాట్లాడుతోందని రాజ్యాంగంపై రాహుల్ నినాదం తెలంగాణలో వర్తించదా అని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయంతో కాంగ్రెస్ ద్వంద్వ విధానం బట్టబయలైందన్నారు. ఢిల్లీలో రాజ్యాంగం పరిరక్షణపై మాట్లాడే కాంగ్రెస్ రియల్ ఫేస్ తెలంగాణలో స్పీకర్ తీర్పుతో బయటపడిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థళను కూడా దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు. పార్టీ మారిన ఎ్మెల్యేల విషయంలో ర్జాయంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిపెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనన్నారు. సేవ్ ది కానిస్టిట్యూషన్ నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని ఇది ఎంతో సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు.






