సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతోంది : హరీష్ రావు

by Muthe.Rajitha |

అసెంబ్లీలో స్నేహపూర్వక వాతావరణాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.

సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతోంది : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీలో స్నేహపూర్వక వాతావరణాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సగటున 32 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించామని గుర్తు చేసిన హరీష్ రావు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం సగటున కేవలం 20 రోజులు మాత్రమే నడిపిందన్నారు. సభ నడిపేందుకు ప్రభుత్వం జంకుతోందని ఎద్దేవా చేసారు. ఎన్ని రోజులైనా సభ నడుపుతామని బీరాలు పలికి, చివరకు ఒక్క రోజుతోనే ముగిస్తారని మండిపడ్డారు.

ఈసారి కనీసం 15 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు పూర్తిగా విఫలమయ్యారని, తాము ఇచ్చిన అజెండాను కాంగ్రెస్‌ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లు పూర్తైనా ఇప్పటివరకు అసెంబ్లీలో ఒక్క హౌస్‌ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు.

Next Story