కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు.. ఆ విషయం అందరికీ తెలుసని కామెంట్

by Gantepaka Srikanth |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) తొలిసారి స్పందించారు.

కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు.. ఆ విషయం అందరికీ తెలుసని కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) తొలిసారి స్పందించారు. శనివారం తెల్లవారుజామున మీడియా ఛానల్ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ‘నా జీవితం తెరిచిన పుస్తకం. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత కూడా చేశారు. ఇందులో కొత్తేం లేదు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత ఏంటో అందరికీ తెలుసు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ నాయకత్వంలో వందకు వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా లేక రైతులు గోస పడుతున్నారని, వరద ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు రాష్ట్ర రైతులను కేసీఆర్ కంటికి రెప్పాలా కాపాడుకున్నారని చెప్పారు. పదేళ్ల పాటు కేసీఆర్(KCR) నిర్మించిన వ్యవస్థను రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు, తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడంపై తమ దృష్టి ఉంటుందని చెప్పారు. తాము రాష్ట్ర సాధనలో పోరాటం చేసినవాళ్లమని, రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగినవాళ్లమని.. తమ సమయం అంతా అందుకోసమే వెచ్చిస్తామని తెలిపారు.

Next Story