- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: మీకో నీతి మాకో నీతా? గుజరాత్ లో వంతెన కొలాప్స్ విషయంలో బీజేపీపై హరీశ్ రావు హాట్ కామెంట్స్
బీజేపీపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ, ఎన్డీఏ పాలిత బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో వంతెనలు కూలడం సర్వసాధారణంగా మారిందని అయినా వీటిపై విచారణలు ఉండవు, చర్యలు ఉండవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఇవాళ గుజరాత్ వడోదరలో మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలి (Gujarat Bridge Collapse) పది మంది దుర్మరణం చెందిన ఘటనపై ఆయన స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరం అని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నిర్మిస్తున్న పోలవరంలో డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం, గైడ్ బండ్ కొట్టుకుపోయినా విచారణ లేదు నివేదిక ఉండదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కుప్పకూలిన ఎస్ఎల్ బీసీ, సుంకిశాల, కొట్టుకుపోయిన వాటర్ పంప్ హౌస్, పెద్దవాగుపైన బీజేపీ కనీసం స్పందించదు ఎన్డీఎస్ఏ రాదన్నారు. కానీ అదే మేడిగడ్డలో (Madigadda) రెండు పిల్లర్లు కుంగితే రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చి హడావిడిగా విచారణ పేరుతో పొలిటికల్ డైవర్షన్ చేస్తూ రాజకీయ ప్రేరేపిత రిపోర్టులను ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇది బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు. అని బీజేపీ పాలిత రాష్ట్రాలలో, బీజేపీ మిత్రపక్షాలు పాలన లో ఉన్న రాష్ట్రాల్లో ఒక నీతి.. బీజేపీని (BJP) ప్రశ్నించే రాష్ట్రాలపై ఇంకో నీతా అని ప్రశ్నించారు.
ప్రమాదాలను రాజకీయ కక్ష సాధింపులకు ఆయుధంగా వాడుకునే బీజేపీ కుటిల బుద్ధికి ఇది అద్దం పడుతుందని.. ఈ రోజు గుజరాత్ లో కూలిన బ్రిడ్జిని విచారణల పేరిట మరమ్మత్తులు చేయరా అని కాళేశ్వరాన్ని కూలేశ్వరం గా దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నానన్నారు. కూలిన బ్రిడ్జిలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి వాడుకున్నట్టే.. తెలంగాణ కు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కు తక్షణమే మరమ్మత్తులు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. మేడిగడ్డ కు మరమ్మత్తులు చేయకున్నా నీటిని తోడే వీలును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానన్నారు.
Read More... గుజరాత్లో కూలిన వంతెన.. బీజేపీకి కౌంటర్ ఇస్తూ KTR సెటైరికల్ ట్వీట్






