Harish Rao: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది: హరీశ్ రావు

by Prasad Jukanti |
Harish Rao: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Lands) అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీం కోర్టులో (Supreme Court) జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బాధ్యత గల ప్రభుత్వం కావాలనే సెలవు దినాల్లో బుల్‌డోజర్లతో విధ్వంసానికి పాల్పడటంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. కంచగచ్చిభూముల విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఓ ప్రకటనలో స్పందించారు. విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని నిలదీయడం ఆహ్వానించదగ్గ పరిణామం అని కంచె గచ్చిబౌలి భూములను, పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన రిపోర్టుతో కళ్లు తెరిపించిందన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా వ్యవహరిస్తే సభ్య సమాజం, న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వస్తాయని గతంలోనూ అనేక సార్లు నిరూపన అయినట్లే ఈరోజు కూడా జరిగిందన్నారు.

విధ్వంసమే విధానంగా..

విధ్వంసమే విధానంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరంకుశ పాలన సాగుతున్నదని ధ్వజమెత్తారు. నాడు హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చి అరాచకం సృష్టిస్తే నేడు బుల్‌డోజర్లతో పర్యావరణ హననం చేశారని ఆరోపించారు. మాకు న్యాయస్థానాల మీద ఎంతో గౌరవం ఉందని అందుకే బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరుపున సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చామని అందులో ఆధారాలతో సహా వాస్తవాలు వివరించామన్నారు. వృక్షో రక్షతి రక్షిత అని పెద్దలంటే, వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ కు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలన్నారు.

Next Story

Most Viewed