Harish Rao: స్కాన్ చేయగానే పాఠాలు.. ‘హరీశ్ రావు సార్’ పంపిన కంటెంట్ బుక్ అందింది!

by Ramesh Naini |

‘హరీశ్ రావు సార్ పంపిన కంటెంట్ బుక్ అందింది’ అంటూ పదో తరగతి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Harish Rao: స్కాన్ చేయగానే పాఠాలు.. ‘హరీశ్ రావు సార్’ పంపిన కంటెంట్ బుక్ అందింది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘హరీశ్ రావు సార్ పంపిన కంటెంట్ బుక్ అందింది’ అంటూ పదో తరగతి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్వంత ఖర్చులతో సిద్దిపేట నియోజకవర్గంలో 2500 మంది పదో తరగతి విద్యార్ధులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ (Digital Content Books) పంపిణీ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు బొధించిన పాఠాలను అతి సులువుగా రివిజన్‌ చేసుకునేలా ఈ డిజిటల్‌ కంటెంట్‌ను తయారు చేసినట్లు హరీశ్ రావు టీమ్ వెల్లడించింది. గత మూడు సంవత్సరాల నుంచి జిల్లాలో దాదాపు పది వేల మందికి పైగా విద్యార్థులకు అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ పుస్తకాలను హరీశ్ రావు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ క్యూఆర్‌ కోడ్‌ను తమ మొబైల్‌ ఫోన్‌లో లింక్‌ చేయగానే ప్రాక్టికల్‌ ఆధారిత పాఠాలు ప్రత్యక్షమవుతాయి. డిజిటల్‌ కంటెంట్‌ ఎంతగానో ఉపయోగపడిందనే విషయాన్ని విద్యార్థులు స్వయంగా చెప్పడమేకాకుండా ఎస్ఎస్సీ ఫలితాల్లోనూ నిరూపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ ప్రోత్సాహం అందిస్తున్న హరీష్ రావుకి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక మూడు ఏళ్ల నుంచి సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు.. ఎంతో ఉపయోగ పడుతున్నాయని అంటున్నారు.

Next Story