- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డి భేటీ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former Chief Minister KCR) ఎర్రవల్లి ఫామ్ హౌస్ (Erravalli Farm House)లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం అయిన కేసీఆర్ పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అలాగే కాళేశ్వరం ఇష్యూపై హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డిలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి (Jagadish Reddy), ప్రశాంత్ రెడ్డీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కాళేశ్వరంపై కమిషన్ నివేదిక (Commission report on Kaleshwaram), జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్యే కవిత సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. నిన్న లిల్లిపుట్ అంటూ జగదీష్ పై కవిత కామెంట్స్ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డితో కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే కాళేశ్వరం కమిషన్ నివేదిక పై హరీశ్ రావుతో చర్చించే అవకాశం ఉంది.
Read More : దడపుట్టిస్తున్న ‘కాళేశ్వరం’ నివేదిక.. మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి






