- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao: రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా బీఆర్ఎస్ కుట్రేనా?
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా కలెక్టర్(Vikarabad District Collector), అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కలిశారు. గురువారం చర్లపల్లి జైలు(Charlapally Jail)కు వెళ్లి ఆయనతో ములాఖత్ అయ్యారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా బీఆర్ఎస్ కుట్రే అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా నరేందర్ రెడ్డి రైతులకు మద్దతు ఇచ్చారు. ఒక్కసారే నరేందర్ రెడ్డికి ఫోన్ చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో ఉందని హరీష్ రావు అన్నారు. నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులుగా తాము రైతుల వైపు ఉండాలా? సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి భజన చేయాలా? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని చేసిన కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసే సేవ ఇదేనా? అని అడిగారు.