- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్గానిక్ వ్యవసాయం.. అసలైన స్ట్రెస్ బస్టర్..
ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా? ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో గడపాలని ఉందా? అలాగే వ్యవసాయంపై ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. కర్ణాటకకు వెళ్లొద్దాం పదండి. 28 రోజులు ఉండేందుకు ఐదు వేలు చెల్లిస్తే చాలు.. ట్రీ హౌజ్ హోమ్ స్టే, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు.

దిశ, ఫీచర్స్ : ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా? ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో గడపాలని ఉందా? అలాగే వ్యవసాయంపై ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. కర్ణాటకకు వెళ్లొద్దాం పదండి. 28 రోజులు ఉండేందుకు ఐదు వేలు చెల్లిస్తే చాలు.. ట్రీ హౌజ్ హోమ్ స్టే, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా గడిపేయొచ్చు.
పచ్చని పొలం.. ఆకర్షించే ప్రదేశం..
మంగళూరు సమీపంలోని కేపు గ్రామంలో ఉన్న 200 సంవత్సరాల పురాతన వారణాశి ఆర్గానిక్ ఫామ్ ప్రతి నెలా వాలంటీర్లను ఆహ్వానిస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకుని, నగర జీవితపు హడావుడి నుంచి విశ్రాంతి తీసుకోవచ్చని సూచిస్తుంది. మంగళూరు నుంచి 50కిమీ దూరంలో ఉన్న 50 ఎకరాల ఆర్గానిక్ ఫామ్‌కు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ భూమి ఓ కుటుంబం కోసం పచ్చని పొలంగా మొదలై.. ఇప్పుడు వివిధ సంస్కృతుల ప్రజలను ఆకర్షించే ప్రదేశంగా మారింది.
ఒక్క సంఘటనతో మార్పు
పార్థ వారణాశి (ఆరవ తరం యజమాని) చెప్పినట్లు.. వారి కుటుంబానికి ఎప్పుడూ వ్యవసాయం అంటే మమకారం ఉండేది. 1960లో ఆయన తాత ‘క్యాంప్‌కో’ అనే రైతుల సంఘాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు కూడా వ్యవసాయ అధ్యయనాల్లో ఉన్నారు. గత 30 ఏళ్లుగా కుటుంబం స్నేహితులు, బంధువులను ఫామ్‌కు ఆహ్వానిస్తోంది. అయితే 2006లో జరిగిన ఓ సంఘటన తర్వాత వాణిజ్యపరంగా ముందుకు వచ్చారు. ఒక 12వ తరగతి పూర్తి చేసిన అమ్మాయి ఫామ్ జీవితం గురించి తెలుసుకోవాలని వచ్చి.. రెండు వారాలు గడిపి.. ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల ప్రేమ పెంచుకుని.. హార్టికల్చర్ ఇంజినీరింగ్ చదివింది. ఇది పార్థను ఆలోచింపజేసింది. నగరవాసులకు ఫామ్ జీవితం ఒక మంచి విశ్రాంతి అని అర్థమైంది. దీంతో 2014లో కర్ణాటక టూరిజం శాఖ సహాయంతో ఫామ్‌స్టేను ప్రారంభించారు.
ఆర్గానిక్ ఫార్మింగ్ ప్యాకేజీ
వాలంటీర్లు.. ఫామ్‌లో నాటడం, కోత, పంటల పోస్ట్-హార్వెస్ట్ ప్రాసెసింగ్, కంపోస్ట్ తయారీ వంటి పనులు చేస్తారు. వరి, కొబ్బరి, మిరియాలు, స్పైసెస్ పండిస్తారు. భోజనం కూడా ఫామ్‌లోని 95% సేంద్రీయ కూరగాయలు, పండ్లతోనే తయారవుతుంది. మొత్తానికి 21 రోజుల కోర్సులో రీజెనరేటివ్ ఫార్మింగ్ గురించి నేర్పిస్తారు. ఐదు రోజుల సర్టిఫికేషన్ కోర్సు రూ.20,000కు ఉంటుంది. అదనంగా ఫస్ట్ ఎయిడ్, CPR, స్విమ్మింగ్, కయాకింగ్ వంటి నైపుణ్యాలు కూడా నేర్పుతారు. ఫామ్ వేస్ట్‌ను కంపోస్ట్‌గా మార్చడం, బయోగ్యాస్ యూనిట్, 7.5kW & 2.5kW సోలార్ ప్యానెల్స్, వర్షపు నీటి సంరక్షణ కోసం ఎనిమిది సహజ గుంటలు, 80 అడుగుల బావి ఉన్నాయి. గ్రామంలోని 55 మంది స్థానికులు ఫామ్ పనుల్లో పాల్గొంటున్నారు. ఇక వాలంటీర్లు 28 రోజులు ఇక్కడ స్టే చేసేందుకు ఐదు వేలు చెల్లించడంతోపాటు ఆరు గంటలు పొలంలో పని చేయాలి.
ట్రీహౌస్.. ప్రధాన ఆకర్షణ
55 అడుగుల ఎత్తులో ఉన్న ట్రీహౌస్.. గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది. ఒక రూమ్, కింగ్ సైజ్ బెడ్, బాల్కనీ ఉంటాయి. ఒక్క రాత్రి ఇందులో గడపాలంటే రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. నెలకు సుమారు 15 మంది వాలంటీర్లు ఇందులో గడిపేందుకు వస్తారని చెప్తున్నారు యజమాని.






