- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గేమ్ ఛేంజర్’ షోస్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా షోలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతించడంతో శుక్రవారం తెల్లవారుజాము 4 గంటల నుంచే థియేటర్లలో సినిమా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ స్పెషల్ షోస్‌పై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలనుద్దేశించి ఆయన విమర్శలు చేశారు. సినిమా టికెట్ రేట్స్ పెంచేది లేదని, స్పెషల్ షోలకు పర్మిషన్స్ ఇవ్వమని రేవంత్ అసెంబ్లీ చెప్పారని, ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకు స్పెషల్ షోలకు అనుమతించారని గుర్తు చేశారు. నచ్చితే ఒకలా..నచ్చకపోతే మరోలా వ్యవహరించడం సీఎం స్థాయికి మంచిది కాదని విమర్శించారు. కక్ష సాధింపులకు ప్రభుత్వం దిగకూడదని, కేసీఆర్ హయాంలో సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించామన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్లే ‘పుష్పా-2’ సినిమా రిలీజ్ సందర్భంగా మహిళ మృతి చెందారని హరీశ్ రావు ఆరోపించారు.






