Harish Rao: రైతులను దోచుకుంటుంటే మీకు సంతోషమా? సీఎంకు హరీశ్ రావు లేఖ

by Prasad Jukanti |

మొక్కజొన్న రైతుల కష్టాలు కనిపించడం లేదా? అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.

Harish Rao: రైతులను దోచుకుంటుంటే మీకు సంతోషమా?  సీఎంకు హరీశ్ రావు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మొక్కజొన్న రైతుల కష్టాలు కనిపించడం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. రైతు కష్టాలు పదేపదే మీకు గుర్తు చేయాలా అన్నారు. మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వెంటనే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డికి ఇవాళ హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి అలసత్వం వీడి అప్రమత్తతతో ఉండాలన్నారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటాలుకు రూ. 2400 దక్కాల్సిన మక్కలకు రూ. 1600కే కొనడం అన్యాయం అని రైతులను దళారులు దోచుకుంటుంటే మీకు సంతోషమా అని నిలదీశారు. మీ ఢిల్లీ టూర్లు, సెటిల్మెంట్లు, సొంత పనులు పక్కనబెట్టి అన్నదాతల ఆవేదన వినాలన్నారు. మద్దతు ధరతో పాటు మీరు ఇస్తామన్న రూ.330 బోనస్ ఇవ్వాల్సిందేనని తక్షణమే రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళనలు చేపడతామన్నారు.

Next Story