- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారంలో నలుగురు రైతుల బలవన్మరణం.. ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు: హరీశ్ రావు సీరియస్
రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని హరీశ్ రావు సీరియస్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో రైతు మామిళ్ళ నరసయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. (Farmer Deaths) రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? అని సీరియస్ అయ్యారు.
ఆత్మహత్యలు వద్దు.. బతికుండి కొట్లాడుదాం..
కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నారని, అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పార్టీ సున్నం పెడుతున్నదని విమర్శించారు. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి.. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆ రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం.. అధైర్య పడొద్దు, (BRS) బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మాజీ మంత్రి పిలుపునిచ్చారు.






