Harish Rao: నువ్వు ఇష్టమొచ్చినట్టు తిడితే.. మేము పడాలా?

by Gantepaka Srikanth |

వరంగల్ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌లో ఒక్కటి కూడా అమలు కాలేదని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు.

Harish Rao: నువ్వు ఇష్టమొచ్చినట్టు తిడితే.. మేము పడాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌లో ఒక్కటి కూడా అమలు కాలేదని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. గురువారం గచ్చిబౌలి స్టేషన్ నుంచి విడుదలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగున్నట్లు తెలిపారు. అమలు చేయడం చేతకాక అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని అన్నారు. రైతుబంధు(Rythu Bandhu), రైతుభరోసా, జాబ్ క్యాలెండర్, పెంచిన పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ కాంగ్రెస్(Congress) మోసం చేసిందని అన్నారు. ప్రతీ బహిరంగ సభలో సలహాలు ఇస్తే తీసుకుంటా అని సీఎం రేవంత్(CM Revanth Reddy) గొప్పగా చెబుతున్నారు.. తామిచ్చే సలహాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్‌(KCR)ను తిట్టడానికే సభలు పెడుతున్నారని అన్నారు. అసలు కేసీఆర్ పేరెత్తకుండా రేవంత్ ఉపన్యాసమే ఉండదని ఎద్దేవా చేశారు.

‘నువ్వు మర్యాద లేకుండా బూతులు తిడితే మేం భరించాలా?’ అని సీఎం రేవంత్‌ను హరీష్ రావు ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఇంట్లో చొరబడి, తలుపులు పగులగొట్టి అరెస్టు చేయడం ఏంటని అడిగారు. దొంగరాత్రి టెర్రరిస్టును తీసుకుపోయినట్లు తీసుకుపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ఫైర్ అయ్యారు. ఇది ప్రజా పాలన కాదు, రాక్షసపాలన, పోలీసు పాలన, పీడిత పాలనగా మారిందని అన్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలను, మహిళలను అరెస్టు చేశారు. వాళ్లందరినీ వెంటనే విడుదల చేయాలి’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Next Story