- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు బీజేపీ వైపు చూస్తున్నారు: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై శాసనమండలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని.. మొదట మీ పార్టీ ఉంటుందో లేదో ఆయన చూసుకోవాలని శాసనమండలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ హితవు పలికారు. સોమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉంటే, అందులో జగదీష్ రెడ్డిది హరీష్ రావు వర్గమా లేక కేటీఆర్ వర్గమా అనేది ముందు తేల్చుకోవాలని, ఆ పార్టీలోనే మూడు ముక్కలాట జరుగుతోందని ఎద్దేవా చేశారు. కవిత వెళ్లిపోయిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ ఒక వైపు.. హరీష్ రావు బీజేపీ వైపు ఉన్నట్లుగా తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పేరుతో మళ్లీ పార్టీ పెట్టుకోవాలనే ఆలోచనపై మీ దగ్గర సమాధానం లేదని.. అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్సా, టీఆర్ఎస్సా? అని అద్దంకి దయాకర్ నిలదీశారు.
హరీష్ రావు మీ పార్టీలోనే ఉంటూ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారని.. మీ చుట్టూ ఆయన తవ్వుతున్న గుంతల గురించి మీకు తెలియదా? అని ప్రశ్నించారు. పార్టీని మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ మీరే మల్లగుల్లాలు పడుతున్నారని, తీవ్ర గందరగోళంలో ఉన్నారని ఆయన విమర్శలు గుప్పించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, పార్టీ బలోపేతం కోసమే అందరూ పనిచేస్తున్నారని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.






