- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రేవంత్ రెడ్డి మాటల్లో ఫేకుడు.. ఢిల్లీకి వెళ్ళి జోకుడు: హరీశ్ రావు
నెలల తరబడి టీవీవీపీ, బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించక పోవడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన 22 నెలల పాలనలో పథకాల్లో కోతలు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు, మాటల్లో ఫేకుడు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన వైఫల్యం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. నెలల తరబడి తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం పట్ల హరీశ్ రావు ఆగ్రహం చేశారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరించింది లేదు, అమలు చేసింది లేదన్నారు.
దీపావళికైనా సంబరాన్ని ఇవ్వు?:
తెలంగాణ వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి ఉందని ఇక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలు అందని దుస్థితి నెలకొందని విమర్శించారు. బస్తీ దవాఖాన వైద్య సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చుక్కలు చూపిస్తోందన్నారు. వైద్యులకు, ఇతర సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగ సంబురం లేకుండా చేసి, వారిని మానసిక క్షోభకు గురి చేయడం తగునా? అని ప్రశ్నించరు. వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడం దుర్మార్గం అని అత్యవసర సేవలు అందించే వైద్య సిబ్బందికే జీతాలు ఇవ్వకుంటే, ఇక ఇతర శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అని నిలదీశారు. జీతాలు ఇవ్వకుండా 13వేల మంది వైద్య సిబ్బందికి దసరా పండుగ దూరం చేశారని కనీసం ఇప్పుడైనా జీతాలు ఇచ్చి వారికి దీపావళి సంబురాన్ని అందించాలని డిమాండ్ చేశారు.






