Harish Rao: ఎస్ఎల్‌బీసీ ఘటనపై ప్రభుత్వ తీరు బాధాకరం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-27 05:00:07  IST  )

ఎస్ఎల్‌బీసీ (SLBC) ఘటనపై తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) తీరు బాధకరమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Harish Rao: ఎస్ఎల్‌బీసీ ఘటనపై ప్రభుత్వ తీరు బాధాకరం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఎల్‌బీసీ (SLBC) ఘటనపై తెలంగాణ ప్రభుత్వ (Telangana Government) తీరు బాధకరమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడ నల్లగొండ జిల్లాలకు చెందిన నాయకులు SLBC టన్నెల్ వద్దకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల బయటకు తీసుకురావడంలో పూర్తి విఫలమైందని అన్నారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని కామెంట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) వేగంగా చేపట్టడం లేదని ఆరోపించారు.

మంత్రులు ఘటనా స్థలానికి హెలికాప్టర్ల (Helicopter)లో వెళతూ.. టీవీల్లో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారే తప్పా సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తి విఫలం అయ్యారని ఫైర్ అయ్యారు. టన్నెల్ చిక్కుకుపోయిన వారి ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషం చాలా ముఖ్యమైందని అన్నారు. లోపల వారికి ఆహారం, తాగునీరు లేవని వాళ్లు ఎలా అందులో ఐదు రోజులు జీవిస్తారనే స్టాండ్ తీసుకుని సర్కార్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. టీబీఎం(TBM)ను బయటకు తీసేందుకు ఇప్పటి వరకు అధికారులు ఓ అంచనాకి రాలేకపోతున్నారని తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెలికాప్టర్ వేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి వెళ్తున్నారని.. ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా.. ఎన్నికల ప్రచారం ముఖ్యమా అని సీఎంను హరీశ్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తరఫున సహాయక చర్యలకు ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలంటూ గత నాలుగైదు రోజులుగా వెయిట్ చేశామని అన్నారు. కానీ, సహాయక చర్యల్లో ఒక్కడుగు కూడా ముందుకు పడకపోవడం బాధాకరమని తెలిపారు. పది ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొని.. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారిని ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ఎస్ఎల్‌బీసీ (SLBC) వద్దకు వెళ్తున్నామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతోన్న సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, తమ అనుభవాలు, ఆలోచనలు అక్కడి అధికారులతో పంచుకుంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Next Story