Kavitha: సంతోశ్ రావు, హరీశ్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరక.. కవిత సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-09-01 12:57:15  IST  )

సొంత పార్టీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha: సంతోశ్ రావు, హరీశ్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరక.. కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి మాజీ ఎంపీ సంతోష్ రావు, హరీశ్ రావు, మెఘా కృష్ణారెడ్డే కారణం అని తెలంగాణ జాృగతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం, నీళ్ల కోసం ఆలోచిస్తుంటే వీళ్లు సొంత వనరులు, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేశారని ఇవాళ మీ వళ్ల తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వెయించే పరిస్థితి వచ్చిందని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్ కు తిరిగి వచ్చిన కవిత ఇవాళ సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హరీశ్ రావు, సంతోష్ రావు నాపై అనేక కుట్రలు చేసినా నేను భరించాను. మీడియా ద్వారా రకరకాలుగా నాపై వ్యక్తిగత దాడిలో నేనెప్పుడు వారి పేరు పెట్టి అనలేదు. కానీ కేసీఆర్ కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైయిరీ ఏంది? ఎందుకోసం ఆ ఖర్మ పట్టింది. ఇటువంటి వాళ్లను చూస్తూ ఎందుకు రక్షణ కల్పించాలి. బీఆర్ఎస్ సోదరులకు కోపం రావొచ్చు. కానీ వాస్తవాలు చేదుగా ఉన్నా అప్పుడప్పుడు మాట్లాడాలన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా అంశాలు ఉన్నాయని రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా ఉన్నా నా పెళ్లప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడిన వ్యక్తి కేసీఆర్. ఏనాడు ఆస్తులపై ఆశలేదన్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకుని సీబీఐ ఎంక్వైయిరీ వేస్తామంటే దీనికంతటికీ ఎవరు కారణం అని ప్రశ్నించారు.

కబర్దార్ బిడ్డా..

పక్కరాష్ట్రం ఎజెండాను అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి.. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్ ను అనరాని మాటలు అన్నారు. వింటుంటే గుండె తరుక్కుపోతుంది. కేవలం రాజకీయ లబ్ధికోసం కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. కేసీఆర్ పై డబ్బుపై ధ్యాస లేదని గతంలో ఇదే రేవంత్ రెడ్డి చెప్పారని అటువంటి కేసీఆర్ పై ఇప్పుడెందుకు ఇంతటి అబండాలు వేస్తున్నారని నిలదీశారు. సంతోష్ రావు, హరీశ్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ కాళేశ్వరంలో పని చేసిన ముగ్గురు ఇంజినీర్లపై రెయిడ్లు చేస్తే ఒక్కొక్కరకి వద్ద వందల కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. వారి వెనుక ఎవరున్నారో ఎంక్వైయిరీ చేసే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వీళ్లను మాత్రం ఏమి అనకుండా కేవలం కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తారు. రేపటి నుంచి సోషల్ మీడియా బ్యాచ్ నన్ను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆపరేట్ చేస్తున్నారని ప్రచారం చేస్తారు. ఖబర్దార్ బిడ్డా.. నేను ఎవరో చెప్తే ఆడే తోలుబొమ్మను కాను. నాది కేసీఆర్, తెలంగాణ రక్తం. వ్యక్తిగతంగానే నేను ఈ కామెంట్స్ చేస్తున్నాన్నారు. కేసీఆర్ పై అబండాలు వేసే అవకాశం ఎవరిచ్చారో బీఆర్ఎస్ శ్రేణులు, తెంలగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ పై ఈ అవినీతి మరక వస్తుందో ఆలోచించాలన్నారు. కొంతమంది కేసీఆర్ పక్కనున్నవాళ్లు కేసీఆర్ పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొంది, వారు చేసిన అనేక చెత్త పనుల వల్ల కేసీఆర్ పేరు బద్నాం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. అయినా వారినే మోస్తాం.. వారినే ముందుకు తీసుకువెళ్తామంటే పార్టీ ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు.

పార్టీ ఉంటే ఏంటీ పోతే ఏంటీ:

బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏంటీ పోతే ఏంటి అని కవిత హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మీద ఎంక్వయిరీ వేసినందుకు స్థానిక సంస్థల్లో నష్టం జరిగితే జరగచ్చు అన్నారు. నా మీద సోషల్ మీడియా లో ప్రచారం చేస్తే తోలు తీస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ కు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు చెప్పిన వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఒక బిడ్డగా నేను బాధపడుతున్నాన్నాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం అయిందని, అనునిత్యం కేసీఆర్ ను విమర్శిస్తూ ఆయన పేరును జపించడం తప్పితే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పడం లేదన్నారు.

Read More : హరీష్ రావు వెనుక CM రేవంత్ రెడ్డి.. కుండబద్దలు కొట్టిన MLC కవిత

బీఆర్ఎస్ గ్రూపు నుంచి కవిత PRO తొలగింపు

Next Story