‘కాళేశ్వరం’ విచారణకు హరీశ్ రావు.. బీఆర్ఎస్ న్యాయవాదులు Vs పోలీసులు

by Kema Shiva Kumar |

జస్టిస్ పి చంద్రఘోష్ (Justice P Chandraghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఇచ్చిన నోటీసులను అందుకున్న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఇవాళ కాసేపటి క్రితం విచారణకు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌ (BRK Bhavanకు చేరుకున్నారు.

‘కాళేశ్వరం’ విచారణకు హరీశ్ రావు.. బీఆర్ఎస్ న్యాయవాదులు Vs పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పి చంద్రఘోష్ (Justice P Chandraghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఇచ్చిన నోటీసులను అందుకున్న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఇవాళ కాసేపటి క్రితం విచారణకు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌ (BRK Bhavanకు చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో ఉన్నారు. అయితే, బహిరంగ విచారణకు హరీశ్ రావు వెంట బీఆర్ఎస్ న్యాయవాదులు కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వారికి ఎదురుపడి అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. బహిరంగ విచారణకు ఎవరైనా హాజరుకావొచ్చని ఫైర్ అయ్యారు. న్యాయవాదులను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Next Story