- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి అరెస్టుపై హరీష్ రావు ఫైర్
నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్మే(Narsapur BRS MLA), మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి(Sunitha Lakshma Reddy) అరెస్టు(Arrest) పట్ల మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్మే(Narsapur BRS MLA), మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి(Sunitha Lakshma Reddy) అరెస్టు(Arrest) పట్ల మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్(GHMC Dumping Yard) ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతుల నిరసన(Protest) మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డిని, పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతూ, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా సునీతా తన ప్రజల ఆందోళనలో భాగస్వామ్యమయ్యారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు.
రైతులు, స్థానికుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను అర్ధరాత్రి నుండి ఎందుకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని నిలదీశారు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారనగర్ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి, భయానక వాతావరణ సృష్టించారన్నారు. అప్రకటి ఎమర్జెన్సీని తలపిస్తున్నారని..ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు, ప్రజా ప్రతినిధులకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కే లేదా? ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చి, అప్రజాస్వామీక విధానాలు అనుసరించడం మీకే చెల్లిందని దుయ్యబట్టారు.
అరెస్టు చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రెడ్డితో పాటు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు.
కాగా జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు నిరనసలో పాల్గొని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సునితా లక్ష్మారెడ్డికి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఇక్కడ ప్రభుత్వం దౌర్జన్యంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమంటూ సునిత మండిపడ్డారు.






