బస్సు చార్జీల పెంపుపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులా.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-09 04:36:01  IST  )

నిరుపేదల నడ్డి విరుస్తూ అడ్డగొలుగా పెంచిన ఆర్టీసీ బస్సు టికెట్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ‘చలో బస్ భవన్‌’కు పిలుపునిస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ (BRS) నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు.

బస్సు చార్జీల పెంపుపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులా.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
X

దిశ, వెబ్‌‌డెస్క్: నిరుపేదల నడ్డి విరుస్తూ అడ్డగొలుగా పెంచిన ఆర్టీసీ బస్సు టికెట్ ధరల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ‘చలో బస్ భవన్‌’కు పిలుపునిస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ (BRS) నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల అరెస్టులు అప్రజాస్వామీకం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనమని అన్నారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇది ఇందిరమ్మ రాజ్యమా.. ఎమర్జెన్సీ పాలనా..

20 నెలల పాలనలో 5 సార్లు బస్సు చార్జీలు పెంచారని ఆరోపించారు. భార్యకు ఫ్రీ అని భర్తలకు, విద్యార్థలుకు టికెట్ డబుల్ చేశారని ఆరోపించారు. ఇప్పటికే జీవో నెంబర్. 53, 54‌లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశాడని ఫైర్ అయ్యారు. ఇలా వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాడని ధ్వజమెత్తారు. నగరానికి తలమానికంగా ఉన్న మెట్రో రైలును ఆగం చేసిండని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తాము శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా.. ఎమర్జెన్సీ పాలనా.. అని మండిపడ్డారు.

మాటల్లో రాజ్యాంగ రక్షణ.. చేతల్లో రాజ్యాంగ భక్షణ

ప్రజాస్వామ్య పాలన అని రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తుండని అన్నారు. మాటల్లో రాజ్యాంగ రక్షణ.. చేతల్లో రాజ్యాంగ భక్షణ అంటూ సెటైర్లు వేశారు. టికెట్ ధరల పెంపు‌పై బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులుగా తమకు లేదా అన్ని ప్రశ్నించారు. తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్ట పాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజాప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియా‌పై కఠిన ఆంక్షలు.. ఇదేమి రాజ్యం రేవంత్‌రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి నేడు.. ఆ ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేశారని అన్నారు. ప్రభుత్వ అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదని తెలిపారు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచితే మెట్రో ఎక్కుతారు అని రేవంత్ ఆలోచన అని.. ఆర్టీసీని అమ్మాలని, ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఉప్పల్ మియపూర్ వర్క్‌షాప్స్‌ను అమ్మకానికి పెట్టాదరని.. బస్టాండ్లు కుదువబెట్టి రూ.1,500 కోట్లు తెచ్చారని ఎద్దేవా చేవారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని.. టికెట్ ధరలు తగ్గించే వరకు బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుందని హరీశ్ రావు అన్నారు.

Read More..

చలో బస్ భవన్‌కు పిలుపు.. మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్

Next Story