- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజన్ లేదు.. ఓన్లీ కమీషన్లే రేవంత్ టార్గెట్ : హరీష్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేసారు. తమ బిల్లులు వెంటనే విడుదల చేయాలనీ వందలాది కాంట్రాక్టర్లు నేడు సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థికశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా కార్యాలయాలను ముట్టడించిన ఘటనపై హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదని కేవలం కమీషన్ల మీద మాత్రమే ఫోకస్ ఉందని ఆరోపించారు.
గత రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి రావడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చునని అన్నారు. మొన్న కమీషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారని, నేడు అదే సచివాలయం సెకండ్ ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్ల మరోసారి మెరుపు ధర్నా చేశారని తెలిపారు.
కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో సీనియారిటీ పాటించకుండా, కమీషన్లు దండుకుంటున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేక స్కాంగ్రేస్ ప్రభుత్వమా? అని నిలదీశారు. ఒక మిషన్ లేదు, విజన్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఒక్కటే టార్గెట్ 'కమీషన్లు' మాత్రమేనని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే ప్రజలంతా ఏకమై ఎక్కడిక్కడ నిలదీస్తారని హరీష్ రావు హెచ్చరించారు.






