- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోతల ముఖ్యమంత్రి.. టిమ్స్‌పై సమాధానమేదీ? : హరీశ్‌రావు
నెల రోజుల్లో టిమ్స్ సనత్‌నగర్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించిందని.. నెల పూర్తి అయిందని.. ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా? అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నెల రోజుల్లో టిమ్స్ సనత్‌నగర్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించిందని.. నెల పూర్తి అయిందని.. ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా? అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనికి సమాధానం ఏమిటని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చేస్తున్న కృషి శూన్యమని పేర్కొన్నారు.
టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప చేస్తున్నదేం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగే ఉందని.. చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రుల మీద లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ తీరు చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుందని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదని చెప్పడానికి టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనమని పేర్కొన్నారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్లిజెన్స్‌కు పాల్పడుతున్నదని తెలిపారు. కమీషన్ల కోసం రెండేళ్లుగా పనులు పూర్తిచేయకుండా, వైద్య సేవలు అందకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ మీద నోరుపారేసుకోవడం మానేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.






