- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : కూలీల కడుపు కొట్టేందుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : హరీష్ రావు
by Muthe.Rajitha |
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై మరోసారి విరుచుకు పడ్డారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao).

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై మరోసారి విరుచుకు పడ్డారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao). సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన హరీష్ రావు.. దళిత గిరిజన బీసీ రైతుల కడుపు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa) అని ఆయన మండిపడ్డారు. సీఎం గారూ.. కూలీల కడుపు కొట్టేందుకు మీకు చేతులు ఎలా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే పది లక్షల మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామంటున్నారు... అంటే ప్రభుత్వం 90 శాతం మందికి ఎగ్గొడుతున్నారని అన్నారు. రకరకాల కారణాలతో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మట్టి పనికి వెళ్లే 90 లక్షల మంది రైతు కూలీలకు పథకం ఎగ్గొట్టడం దుర్మార్గం అని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు.
Next Story






