Harish Rao: ఆ డిమాండ్ చేయడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-14 13:28:34  IST  )

రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు.

Harish Rao: ఆ డిమాండ్ చేయడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. పోడు భూములకు పట్టాలివ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పా? అని నిలదీశారు. కౌటాలా పోలీసు స్టేషన్‌లో నిర్బంధించిన ప్రవీణ్‌కుమార్ సహా బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్.. CM రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

Next Story