RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్.. CM రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్

RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్.. CM రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా ఖండించారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్భందించడం రేవంత్(CM Revanth Reddy) ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనమని పేర్కొన్నారు. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో సహా బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉందని కేటీఆర్ మండిపడ్డారు.

Next Story